డాక్టర్ ఎమ్వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ.. సువర్ణ సుందరి రియన్ కార్నేనేషన్ సబ్జెక్ట్ రోలర్ కోస్టర్ స్క్రీన్ ప్లే తో మినిట్ బై మినిట్ ఆడియన్స్ కి మంచి త్రిల్ ని ఇస్తుంది కరోనా లో చిక్కుకుపోయిన మా మూవీ రిలీజ్ కు ఇదే కరెక్టు టైం అని నమ్ముతున్నాం ఎందుకంటే ఈమధ్య వచ్చిన బింబిసారా, కార్తికేయ-2, మసూద,లకు ఆడియన్స్ మంచి హిట్ ఇచ్చారు అలాంటి జానర్ లో వస్తున్న మా సువర్ణ సుందరి మూవీ కి కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం అలాగే సినీ సర్కార్ ఎంటర్టైన్మెంట్స్ వీరబాబు గారు మా సువర్ణ సుందరి మూవీ ని పెద్ద సినిమా స్థాయిలో ఫిబ్రవరి 3 నా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మీరంతా సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాము అని అన్నారు.
జయప్రద, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: యెల్లుమహంతి ఈశ్వర్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
పీఆర్వో: బి. వీరబాబు
సహ నిర్మాత: శ్రీకాంత్ పండుగల
సమర్పణ:డాక్టర్ ఎమ్వికె రెడ్డి
నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మీ
రచన,దర్శకత్వం: సురేంద్ర మాదారపు