నిషేధిత పీఎఫ్ఐతో లింకులున్నాయని కొచ్చిలోని గ్రీన్ వ్యాలీ అకాడమీలో ఎన్ఐఏ దాడులు

నిషేధిత పీఎఫ్ఐ తో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్ఐఏ కొచ్చిలోని గ్రీన్ వ్యాలీ అకాడమీలో సోదాలు నిర్వహించింది. పీఎఫ్ఐతో దగ్గరి సంబంధాలను ఈ సంస్థ కలిగివుందని తెలుస్తోంది. ఈ దాడుల సందర్భంగా ఎన్ఐఏ అధికారులు కొన్ని పుస్తకాలు, మొబైల్ ఫోన్స్ తో పాటు మరికొన్ని పత్రాలను సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్నారు. గ్రీన్ వ్యాలీ అకాడమీ కింద అనేక విద్యా సంస్థలున్నాయి. ఈ సంస్థల్లో నిషేధిత పీఎఫ్ఐ కార్యకర్తలు క్లాసులు నిర్వహించారా? నిర్వహిస్తే… ఏం చెప్పారు? అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. కొన్ని రోజుల క్రిందటే అరెస్టైన సీఏ రవూఫ్ తరుచూ ఈ సంస్థకు వచ్చేవారని విచారణలో తేలింది. ఆయనకు ఆలిండియా ఇమామ్ కౌన్సిల్ నేత కరమానా అష్రఫ్ మౌల్వీ ఓ పుస్తక అనువాదం కోసం రౌఫ్ కు ఈ సంస్థలో గది కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related Posts

Latest News Updates