తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు వేంకటేశ్వరుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. తిరుమాడ వీధుల్లో వాహనంపై ఊరేగుతూ.. భక్తులకు దర్శనమిచ్చాడు. వాహన సేవలో భాగంగా మలయప్పస్వామిని చూసేందుకు భక్తులు కూడా తరలివచ్చారు.