ముత్యాలు జీవిత కథ ఆధారంగా సూరీడు మినీ మూవీ

ప్రయోగాత్మక దర్శకుసు పి సి ఆదిత్య దర్శకత్వంలో మహా బోధ క్రియేషన్స్ బ్యానర్ పై బి జయ ప్రకాష్ నిర్మిస్తున్న సూరీడు మినీ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 20న హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ప్రారంభమైంది. లెజెండరీ దర్శకుడు రేలంగి నరసింహ రావు తొలి క్లాప్ కొత్తగా.. బెంగళూరు యూనివర్సిటీ తెలుగు ప్రొఫెషర్ శ్రీమతి ఆశ జ్యోతి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సపాల్ బి ఐలయ్య గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర రచయిత,విద్యావేత్త భూతం ముత్యాలు పోషిస్తున్నారు. ఆయన జీవితం లో జరిగిన కొన్ని ముఖ్య వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించడం జరిగింది. 55 నిమిషాల నిడివితో తెలంగాణలోని అనేక ముఖ్య ప్రాంతాలలో షూటింగ్ జరుగనుంది. ఇంకా ఈ చిత్రంలో నటీనటులు శివాజీ రాజా, సహదేవ్ పోతుగంటి , రాజేంద్ర, దీక్ష, షైజా, అరవిందు తదితరులు నటిస్తారు. ఈ చిత్రానికి కెమెరా: ఏ గణేష్, సహా దర్శకుడు : వెంకటేష్ సారంగా, ఎడిటింగ్: పర్వతాల నంబి, రచనా, దర్శకత్వం: డా పి సి ఆదిత్య.

Related Posts

Latest News Updates