“సంబరాల ఏటిగట్టు” సినిమాలో వారియర్ లుక్ లో ఆకట్టుకుంటున్న సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “సంబరాల ఏటిగట్టు”లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయి దుర్గతేజ్ మేకోవర్ అయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన “సంబరాల ఏటిగట్టు” సినిమా కార్నేజ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోలో వారియర్ లాంటి ఫిజిక్ తో సాయిదుర్గ తేజ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

స్ట్రిక్ట్ డైట్, ఎక్సర్ సైజ్ తో ఈ సినిమా క్యారెక్టర్ కు తగినట్లు మారిపోయారు సాయిదుర్గ తేజ్. ఈ ఇంటెన్స్ యాక్షన్ సినిమాకు, తన క్యారెక్టర్ కు వందశాతం న్యాయం చేసేందుకు సుప్రీమ్ హీరో పెడుతున్న ఎఫర్ట్స్ ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సంబరాల ఏటిగట్టు కార్నేజ్ చూస్తే ఈ సినిమాతో సాయి దుర్గతేజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారో తెలుస్తోంది.

సంబరాల ఏటిగట్టు చిత్రాన్ని సాయిదుర్గ తేజ్ 18వ చిత్రంగా నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న సంబరాల ఏటిగట్టు సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Related Posts

Latest News Updates