మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని తీర్పునిచ్చింది. దీనిపై మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా సారథ్యంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సుప్రీం కోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే గంగారెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టు తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది.కేసులోని మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరోసారి విచారణ చేపట్టాలని సూచించింది. డిఫాల్డ్ బెయిల్ రద్దు కాదంటూ ఏపీ హైకోర్టు తీర్పునివ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.దర్యాప్తులో భాగంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.