వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టులో మరో 4 కొత్త బెంచ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక ప్రకటన చేశారు. సుప్రీంలో పని సౌలభ్యంతో పాటు కొన్ని రకాల కేసులను మాత్రమే విచారించడానికి ఈ బెంచ్ లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. క్రిమినల్ అంశాలు, ప్రత్యక్ష పరోక్ష పన్నులు, భూసేకరణ, వాహన ప్రమాదాల క్లెయిమ్ లు వంటి అంశాలను ఈ 4 కొత్త బెంచ్ లు చూస్తాయని సీజేఐ తెలిపారు. ఒకానొక కేసులో అత్యవసరంగా కేసును వాదించాలంటూ ఓ వ్యక్తి సుప్రీం మెట్లెక్కడంతో సీజేఐ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.