జనాభా నియంత్రణ విషయంలో జోక్యం చేసుకోం… : సుప్రీం కోర్టు

జనాభా నియంత్రణ విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జననాల సంఖ్య పెరిగినప్పటికీ దేశ జనాభా స్థిరంగా వుందని, కోర్టు జోక్యం చేసుకోవాల్సిన సమస్య కాదని న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయంపై ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కోర్టు వ్యాఖ్యానించింది. పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను స్వీకరించేందుకు సుప్రీం నిరాకరించిన నేపథ్యంలో పై విధంగా వ్యాఖ్యనించింది.

 

జనాభా నియంత్రణ అనేది సామాజిక సమస్య అని, దీనిపై ఏమని నివేదిక ఇవ్వగలమని న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఈ పిటిషన్ ను అశ్విని ఉపాధ్యాయ వెనక్కి తీసుకున్నారు. ఇక… దేశంలో జనాభా నియంత్రణకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని కేంద్రం సుప్రీంకి అఫిడవిట్ సమర్పించింది.

Related Posts

Latest News Updates