సినిమా థియేటర్లలోకి తినుబండారాల అనుమతివ్వడంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. బయటి నుంచి తెచ్చే ఆహారం, పానీయాలను నిషేధించే హక్కు సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ యాజమానులకు వుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. శిశువుల కోసం తల్లిదండ్రులు తీసుకొచ్చే ఆహారంపై మాత్రం నిషేధం విధించొద్దని సుప్రీం స్పష్టమైన తీర్పునిచ్చింది. అయితే… థియేటర్లు, మల్టీప్లెక్స్ లో వుండే ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ ని కొనుగోలు చేసే విషయంలో వినియోగదారుడికి పూర్తి స్వేచ్ఛ వుంటుందని సుప్రీం తేల్చి చెప్పింది.

హాల్స్ వద్ద స్నాక్స్, కూల్ డ్రింక్స్‭ను.. సినిమా ప్రేక్షకుడు ఖచ్చితంగా కొనుగోలు చేయాలన్న నిబంధన ఏం లేదని.. ప్రేక్షకుడు అవసరమైతేనే స్నాక్స్ కొనుగోలు చేస్తాడని చెప్పింది.2018 లో జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ యాజమాన్యం సుప్రీంలో దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీం విచారించింది.