టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. తమ అరెస్టును సవాల్ చేస్తూ రామచంద్ర భారతితో సమా ముగ్గురు నిందితులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింద. బెయిల్ పిటిషన్ విషయంలోనూ సూచనలు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు వుందని నిందితలుకు సూచించింది. ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్ పై న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమనాథ్ విచారణ చేపట్టారు.