చారిత్రక కట్టడమైన ఎర్రకోటపై 2000 సంవత్సరంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి లష్కరే తొయిబా ఉగ్రవాది మహమ్మద్ ఆరిఫ్‌కు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. నేరంలో ఉగ్రవాది పాత్రపై ఆధారాలు విస్పష్టంగా ఉన్నందువల్ల మరణశిక్షే సరైనదని పేర్కొంది. శిక్షను పునఃసమీక్షించాలంటూ ఆరిఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వంపై నేరుగా జరిగిన ఈ దాడిలో అతడికి మరణ శిక్షే సరైనదంటూ తీర్పునిచ్చింది. 2000 డిసెంబరు 22వ తేదీ రాత్రి కొంతమంది ముష్కరులు ఎర్రకోటలో ప్రవేశించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
