సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో షేర్ చేశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మర్యాద పూర్వకంగా చంద్రబాబు నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆయనకు శాలువా కప్పి, ఆత్మీయంగా ఆహ్వానించారు.
After a long time..I met my dear friend and respected Chandrababu Naidu garu and spent memorable time ..I wished him good health and great success in his political life. @ncbn pic.twitter.com/shIoKLROz4
— Rajinikanth (@rajinikanth) January 10, 2023
అయితే… వీరిద్దరూ దేని గురించి మాట్లాడుకున్నారో మాత్రం తెలియదు. నా ప్రియమైన మిత్రుడు రజనీకాంత్ ను కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జైలర్ షూటింగ్ కోసం రజనీకాంత్ హైదరాబాద్ కి వచ్చారు. షూటింగ్ అయ్యాక.. రజనీ చంద్రబాబు నివాసానికి వెళ్లి, భేటీ అయ్యారు. అయితే… రెండు రోజుల క్రిందటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. మళ్లీ ఇప్పుడు సినిమా రంగానికి చెందిన తలైవా చంద్రబాబుతో భేటీ అయ్యారు.
It was a pleasure to meet and interact with my dear friend 'Thalaivar' @rajinikanth today! pic.twitter.com/b8j1BxICEF
— N Chandrababu Naidu (@ncbn) January 9, 2023







