హనుమాన్ రిలీజ్ కు ముందు డైరెక్టర్ ప్రశాంత వర్మ, డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ అధీరా అనే పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేస్తూ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత అధీరాకు సంబంధించిన అప్డేట్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత హనుమాన్ ప్రమోషన్స్ కోసం అధీరాను కొంతకాలం పక్కన పెట్టాడు ప్రశాంత్ వర్మ.
ఇక హనుమాన్ సినిమా తర్వాత ఈక్వేషన్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ఇప్పుడు అధీరాను మరోలా సెట్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతర్గత సమాచారం మేరకు అధీరా దర్శకత్వ బాధ్యతల్ని నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్నీకి అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఇప్పటికే ఈ మేరకు డీల్ ఓకే అయిందని టాక్.
ప్రస్తుతం ప్రశాంత వర్మ చాలా బిజీగా ఉన్నాడు. జై హనుమాన్ స్క్రిప్ట్ వర్క్స్ తో పాటూ బ్రహ్మ రాక్షస ప్రీ ప్రొడక్షన్ లో తలమునకలై ఉన్నాడు. ఇప్పుడు వేరే సినిమాలపై ఫోకస్ చేసేంత టైమ్ అతని దగ్గర లేదు. అందుకే అధీరాకు సంబంధించిన కథ, రచన మొత్తం ప్రశాంత్ వర్మ చేసి దర్శకత్వ బాధ్యతల్ని మాత్రం విజయ్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అధీరా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే రానుంది.