ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ సునీల్ దేవధర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఏమాత్రం వుండదని తేల్చి చెప్పారు. జనసేన- బీజేపీ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని చేదు అనుభవాలు చూశామని అన్నారు. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకోరాదని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే రోడ్డు మ్యాప్ అంశంపై జనసేన చీఫ్ పవన్ తో తాము అంతర్గతంగా మాట్లాడతామని ప్రకటించారు. మీడియాతో పంచుకోమని స్పష్టం చేశారు. అయితే.. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు.