అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీకి వచ్చిన సుమంత్ కెరీర్ మొదట్లో మంచి సినిమాలే చేశాడు. మొదటి సినిమా ఫ్లాపైనా సత్యం, గోదావరి సినిమాల సక్సెస్ అతనికి మంచి ఛాన్సులొచ్చేలా చేసింది. ఆ తర్వాత కమర్షియల్ గా ట్రై చేసిన గౌరీ, మహానంది సినిమాలు కూడా థియేట్రికల్ రెవిన్యూలు తీసుకొచ్చాయి. కానీ తర్వాత వరుస ఫ్లాపులు, పెళ్లి జీవితంలో వచ్చిన సమస్యల వల్ల చాలా కాలం పాటూ సుమంత్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. https://cinemaabazar.com/
మళ్లీ 2017లో మళ్లీ రావా సినిమాతో మంచి సక్సెస్ అందుకుని ట్రాక్ లోకి వచ్చాడు. కట్ చేస్తే మళ్లీ వరుస ఫ్లాపులు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఇదిలా ఉంటే సుమంత్ హీరోగా ఇప్పుడు అహం రీబూట్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ను వద్దనుకుని ఓటీటీ బాట పట్టింది. ఆహాలో జూన్ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ట్రైలర్ తో పాటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. https://cinemaabazar.com/
ప్రస్తుతమున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా సుమంత్ లాంటి హీరోల సినిమాలను ఆడియన్స్ థియేటర్లకు వెళ్ళి చూసే ఛాన్సులు చాలా తక్కువున్నాయి. చూడ్డానికి అహం రీ బూట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. మరి ఈ సినిమా సుమంత్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. https://cinemaabazar.com/