కాబూల్ లోని పాఠశాలపై ఆత్మాహుతి దాడి… 19 మంది దుర్మరణం

అఫ్గాన్ లోని కాబూల్ లోని ఓ పాఠశాలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 19 మంది విద్యార్థులు మరణించారని పోలీసులు వెల్లడించారు. దశ్త్ ఇ బార్చి ప్రాంతంలో ఈ పేలుడు జరిగిందని, 27 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ పేలుడుకు ఎవరు బాధ్యులో ఇంకా తెలియాల్సి వుందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది. ఆత్మాహుతి దాడి జరగడంతో భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. అయితే.. ఇంకా ఎంత మంది మరణించారన్న వివరాలు పూర్తిగా తెలియాల్సి వుందని, ప్రాథమికంగా 19 మంది అని భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. గత సంవత్సరం ఆఫ్గనిస్తాన్ లో తాలిబాన్ లు తిరిగి అధికారంలోకి వచ్చారు. దీంతో రెండు యుద్ధానికి ముగింపు పలికినట్లైంది. హింస కూడా తగ్గింది. అయితే.. కొన్ని నెలల నుంచి మళ్లీ భద్రత సరిగ్గా వుండటం లేదు.

Related Posts

Latest News Updates