దేశంలో సంతోషకరమైన రాష్ట్రం మిజోరాం… సర్వేలో వెల్లడి

మన దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం మిజోరాం అని తేలింది. సంతోషకరంతో పాటు వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం కూడా మిజోరాం అనే తేలింది. గురుగ్రామ్ లోని మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ కి చెందిన స్ట్రాట్రెజీ ప్రొఫెసర్ రాజేశ్ కె. పిలానియా దీనిపై అధ్యయనం చేయగా… ఈ విషయం తేలింది. కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలు, మతం, కోవిడ్ ప్రభావం అనే అంశాల ప్రాతిపదికగా ఈ సర్వే జరిగింది. అలాగే స్థానిక ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై, ఆనందంపై ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయో పరిశీలించి, అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరాంను గుర్తించారు.

 

ఇక… స్థానిక ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి పోషకులతో క్రమం తప్పకుండా సమావేశం అవుతారని, దీని వల్ల పిల్లలు బాగా చదువుతూ… అక్షరాస్యత కూడా పెరిగిందని సర్వే తెలిపింది. చిన్న వయస్సులోనే సంపాదించాలన్న ప్రోత్సాహం పిల్లలకు మిజోరాంలో వుందని తేలింది.కుటుంబ బాంధవ్యాలు, వృత్తి, మతం, కరోనా ప్రభావం, సామాజిక సమస్యలు-దాతృత్వ గుణం, మానసిక-శారీరక ఆరోగ్యం అనే ఆరు అంశాలను ఈ సర్వేలో ప్రాతిపదికగా పరిగణించాం. కులమతాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని చిన్నారులు చాలా ముందుగానే సంపాదనపై దృష్టి పెడుతున్నారు.లింగ వివక్ష ఏమాత్రం కనిపించలేదు అని నిర్వాహకులు తెలిపారు.

Related Posts

Latest News Updates