నందిగామ జిల్లా పర్యటన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో చంద్రబాబు ప్రధాన భద్రతాధికారి మధు గాయపడ్డారు. ఆయనకు రక్తస్రావం కూడా జరిగింది. నందిగామ ప్రధాన రహదారి నుంచి మార్కెట్ రోడ్డుకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. దీంతో చంద్రబాబు భద్రతాధికారి మధు చంద్రబాబుకు అడ్డుగా నిలిచారు. దీంతో ఆయనకు గాయమై, రక్తస్రావమైంది.
దీంతో ఆయనకు కాన్వాయ్ లోనే వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతల్లారా ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా చూశామా? అంటూ ప్రవద్నించారు. పులివెందుల రాజకీయాలు నందిగామలో పనిచేయవని హెచ్చరించారు. మరోవైపు ఈ రాళ్ల దాడిని టీడీపీ నేతలు ఖండించారు.