ఇంకా నా మైండ్‌లోనే ఉంది -ఎమోషనలైన మహేశ్ బాబు

మహేశ్ బాబు తాజాగా ఓ వెబ్ సిరీస్ పై తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అయి దానిపై బాగా చర్చ జరగడమే కాక ఆ సిరీస్ ఏంటి, అసలు అందులో అంతగా ఏ ముందనే చర్చ నడుస్తోంది.

మహేశ్ బాబు (Mahesh Babu) తాజాగా ఓ వెబ్ సిరీస్ పై తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘ఎవరైనా ఇలా ఎలా చేయగలుగుతున్నారు. ఆ పని చేస్తున్నప్పుడు వారి చేతులు కనీసం వణకవా అనే అనేక ప్రశ్నలు నాకు ఈ పోచర్ (Poacher) సిరీస్ చూసిన తర్వాత అనిపించిందని, అప్పటినుంచి అందులోని సన్నివేశాలు నా మైండ్ లోనే మెదులుతున్నాయంటూ’ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టు గురించి బాగా చర్చ జరగడమే కాక ఆ సిరీస్ ఏంటి, అసలు అందులో అంతగా ఏ ముందనే చర్చ నడుస్తోంది.

ఇక సిరీస్ విషయానికి వస్తే.. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన పొచర్ (Poacher) అనే మలయాళ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రసిద్ధ మలయాళ నటి నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ప్రధాన పాత్రలు పోషించగా, ప్రతిష్టాత్మక ఎమీ అవార్డు విన్నర్ రిచీ మెహతా దర్శకత్వం వహించారు. దాదాపు 5 సంవత్సరాలు ఈ చిత్ర యూనిట్ కేరళలోని కొన్ని రహస్య ప్రాంతాల్లో రీసర్చ్ చేయడమే గాక, సీనియర్ ఫారెస్ట్ అధికారుల అభిప్రాయాలను తీసుకోని, అప్పటి కేసులను స్టడీ చేసి మరి నిజంగా జరిగిన ప్రాంతాల్లోనే ఈ సిరీస్ ను రూపొందించడం విశేషం

Related Posts

Latest News Updates