‘RRR’తో వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించాడు రాజమౌళి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు హేమా హేమీలని ఒకే సినిమాలో చూపించి ఈ ఇద్దరు హీరోల అభిమానులకు మర్చిపోలేని ట్రీట్ ఇచ్చిన రాజమౌళి ఈ మూవీతో హాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం వచ్చే ఏడాది లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఆస్కార్ అవార్డ్ వేడుకల్లో ‘RRR’కు పలు విభాగాల్లో నామినేషన్స్ దక్కాలని తద్వారా దర్శకుడిగా గ్లోబల్ గా తన పేరు మారుమ్రోగిపోవాలనే ప్రయత్నాల్లో వున్నారు రాజమౌళి. అదలా ఉండగా ‘RRR’ వంటి భారీ పాన్ ఇండియా వండర్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబుతో పాటు ఆయన అభిమానులు కూడా చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ ఈ మూవీని నిర్మించబోతున్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా అత్యంత భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ తెరపైకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లైన్ ని లాక్ చేసిన జక్కన్న ప్రీ ప్రొడక్షన్ పునుల్లో బిజీగా వున్నారట. వచ్చే ఏడాది ఈ భారీ పాన్ ఇండియా మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్యెంచరస్ మూవీగా రూపొందించనున్నారు. అయితే ఈ మూవీని యదార్ధ సంఘటనల సమాహారంగా తెరపైకి తీసుకురానున్నారంటూ తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో భారీ స్థాయిలో తెరపైకి తీసుకురానున్న ఈ మూవీలో మహేష్ హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో సరికొత్త మేకోవర్ తో కనిపించనున్నాడట. ఫిజికల్ గానూ రాజమౌళి సినిమాల్లో హీరోలు కొత్తగా ఫిట్ గా కనిపిస్తుంటారు. మహేష్ కూడా అదే పంథాలో ఫిజికల్ గానూ సరికొత్త మేకోవర్ తో కనిపించనున్నాడని చెబుతున్నారు. పైగా ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే మహేష్ సరసన చూపించడానికి ప్రయత్నాలు జారుతున్నట్లు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో వున్న ఈ మూవీని వచ్చే ఏడాది భారీ స్థాయిలో ప్రారంభించబోతున్నారు.