సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ SSMB #28 షూటింగ్ ప్రారంభమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సెట్స్‌లో మహేష్ బాబుతో త్రివిక్రమ్ మాట్లాడుతున్న పిక్‌ను రిలీజ్ చేశారు. ఆ ఫొటోను చూస్తే.. సీన్ వివరిస్తున్నట్లు ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. ఈ సినిమాలో మహేష్ కెరీర్‌లోనే తొలిసారి డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారనటి టాక్ వస్తోంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో మరో మహేష్ బాబు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రారంభమైన షెడ్యూల్ 25 రోజుల పాటు సాగుతున్నట్లు సమాచారం. యాక్షన్ సీన్స్‌తో పాటు.. పాటలు కూడా చిత్రీకరించేందుకు మాటల మాంత్రికుడు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ తన లుక్‌ను పూర్తిగా ఛేంజ్ చేసుకున్నారు. RRR మూవీ కోసం ఎన్టీఆర్‌కు ట్రైనర్‌గా పనిచేసిన లాయిడ్ స్టీవెన్స్.. మహేష్ బాబు సిక్స్ ప్యాక్ లుక్ కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతుండడంతో అభిమానులకు అంచనాలు పెరిగిపోయాయి. దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరు కలవడం విశేషం. గతంలో అతడు, ఖలేజా సినిమాలు రాగా.. అతడు మూవీ హిట్‌గా అవ్వగా.. ఖలేజా మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. మూడో సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు.
https://twitter.com/vamsi84/status/1569207501404635136