తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజు కూడా ఘనంగానే కొనసాగుతున్నాయి. సుప్రభాత సేవ మొదలు.. మిగితా విశేష సేవలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం చిన్న శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో శ్రీమలయప్ప స్వామి చిన్నశేషవాహనం పై నుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ సేవలో సీఎం జగన్ తో పాటు సామాన్య భక్తులు కూడా పాల్గొన్నారు. రాత్రి 7 గంటల తర్వాత శ్రీవారు అమ్మవారితో కలిసి హంస వాహనంపై ఊరేగనున్నారు.