శ్రీశైలం మల్లన్న సేవలో సీజేఐ దంపతులు

ఆంధ్రప్రదేశ్‌లోని  శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం సతీసమేతంగా ఆయలయానికి చేరుకున్న సీజేఐ, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు సీజేఐ చంద్రచూడ్ దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందచేశారు. ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల చిత్ర పటాలను అందచేశారు. అంతకుముందు ఆయలానికి చేరుకున్న సీజేఐకి ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. జస్టిస్ చంద్రచూడ్తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీఎస్ నరసింహ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.

Related Posts

Latest News Updates