శ్రీనగర్ లోని ప్రఖ్యాతమైన తులిప్ గార్డెన్ కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్ లో విదేశీయులతో సహా 3.7 లక్షల మంది పర్యాటకులు దీనిని సందర్శించారు. భారతీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకుల స్పందన కూడా బాగుందని అధికారులు ప్రకటించారు. ఈ సీజన్ లో అత్యధికంగా పర్యాటకులు తరలి వచ్చారని, దీంతో తులిప్ షో సక్సెస్ అయ్యిందని వివరించారు. తులిప్ గార్డెన్ ఇన్‌ఛార్జి అధికారి ఇనామ్-ఉర్ రెహమాన్ శుక్రవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. 32 రోజుల నుంచి తులిప్ షో జరుగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు 3.7 లక్షల మంది పర్యాటకులు వచ్చారని తెలిపారు. వీరిలో సుమారు 3,000 మంది విదేశీయులని వివరించారు. గత ఏడాది ఈ సీజన్‌లో 3.6 లక్షల మంది వచ్చారన్నారు. తులిప్ ఉద్యానవనానికి అంతర్జాతీయ స్థాయి ఆకర్షణను సృష్టించాలనేదే తమ లక్ష్యమని, అందులో తాము విజయం సాధించామని చెప్పారు.
32 రోజుల నుంచి తులిప్ షో జరుగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు 3.7 లక్షల మంది పర్యాటకులు వచ్చారని తెలిపారు. వీరిలో సుమారు 3,000 మంది విదేశీయులని వివరించారు. గత ఏడాది ఈ సీజన్‌లో 3.6 లక్షల మంది వచ్చారన్నారు. తులిప్ ఉద్యానవనానికి అంతర్జాతీయ స్థాయి ఆకర్షణను సృష్టించాలనేదే తమ లక్ష్యమని, అందులో తాము విజయం సాధించామని చెప్పారు. ఈ సంవత్సరం థాయ్‌లాండ్, అమెరికా, అర్జంటైనా, యూరోపియన్ దేశాల నుంచి పర్యాటకులు వచ్చారని తెలిపారు. తులిప్ పుష్పాలు పూసే కాలం ముగుస్తోందని చెప్పారు. ఈ కాలం ముగియక ముందే వీటి అందాలను చూడటం కోసం పర్యాటకులు వస్తున్నారన్నారు.
రంగురంగుల పువ్వులు టూరిస్టులను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఎరుపు, తెలుపు రంగుల్లో తులిప్ పుష్పాలు సందర్శకులను ఆకర్శిస్తున్నాయి. ప్రతియేటా వసంత రుతువులో తులిప్ పుష్పాలు వికసించే సమయంలో..ఈ గార్డెన్‌ను పర్యాటకుల కోసం అధికారులు తెరుస్తుంటారు. ఈ పూల వనంలో ఐదు రంగుల్లో తులిప్ పుష్పాలు దర్శనమిస్తాయి. తులిప్ పూలతోపాటే చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్ గార్డెన్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్‌లు ఉన్నాయి. అయితే శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గార్డెన్ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 హెక్టార్‌లు ఉంది. ప్రతి ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసిస్తుంటే ఈ గార్డెన్‌ను తెరుస్తారు. అదేవిధంగా ప్రతి ఏడాది తులిప్ ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఈ గార్డెన్‌లో 64 రకాల్లో మొత్తం 15 లక్షల తులిప్ మొక్కలు ఉన్నాయి.