భద్రాచలంలో రాములోరికి మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కల్యాణ తేదీని ఆలయ అధికారులు వెల్లడించారు. మార్చి 30వ తేదీన కల్యాణ క్రతువు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అనంతరం మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం, మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కల్యాణ తలంబ్రాలు కలిపే వేడుక, వసంతోత్సవం, డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు, కల్యాణం, పట్టాభిషేకాన్ని భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఏర్పాట్లు చేసేందుకు అధికారులు తలమునకలయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.