బ్రిక్స్ సమావేశాలకు ఆతిథ్యమివ్వనున్న దక్షిణాఫ్రికా

బ్రిక్స్  సమావేశాలకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా 15వ బ్రిక్స్ సమావేశాలు ఆగస్టులో జరుగనున్నాయి. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ ప్రకటించారు.  బ్రిక్స్ కూటమిని 2009లో స్థాపించారు. ఇందులో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు సభ్యులగా ఉన్నాయి. ఈ కూటమి మొదట బ్రిక్గా ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్ కూటమిగా రూపాంతరం చెందింది. కూటమిలోని దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటైంది. బ్రిక్స్ మొదటి సమావేశం 2009 జూన్లో రష్యాలోని యెకటేరిన్ బర్గ్లో జరిగింది. 13వ బ్రిక్స్ సమావేశం 2021 సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో వర్చువల్గా జరిగింది. 2011, ఏప్రిల్లో చైనాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో దక్షిణాఫ్రికా తొలిసారిగా పాల్గొన్నది. గత సమావేశాలకు చైనా వేదికగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఈ సమావేశాలను వర్చువల్గా నిర్వహించారు.

Related Posts

Latest News Updates