వైద్యులే నిజమైన హీరోలు… అంకుర్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో సోనూసూద్

హైదరాబాద్ గచ్చిబౌలిలో అంకురా హాస్పిటల్స్ ని బాలీవుడ్ నటుడు సోనూసద్ ప్రారంభించారు. దాదాపు 50 వేల స్క్వేర్ యార్డ్స్ లో 120 బెడ్స్ తో ఈ అంకుర హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో వచ్చింది. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం.. సోనూసూద్ కి ఘనంగా స్వాగతం పలికారు. రియల్ హీరోల కంటే వైద్యులే నిజమైన హీరోలని అన్నారు. నిజానికి వైద్యులను దేవుళ్లుగా పరిగణిస్తారని, వైద్యుల ఇబ్బందులను నయం చేయడానికి అత్యంత విశ్వాసంతో పనిచేస్తారన్నారు.

కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ వైద్యులు పనిచేశారని, ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లుగా సేవలందించారన్నారు. తమ తమ కుటుంబం సమయాన్ని కూడా త్యాగం చేసి, సమాజం కోసం పనిచేస్తారని సోనూసూద్ అన్నారు. అంకుర హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా వుందని సోనూసూద్ అన్నారు. గతంలో తాను అంకుర హాస్పిటల్స్ తో కలిసి పనిచేశానని, మహమ్మారి సమయంలో కొన్ని క్లిష్టమైన కేసులను వారికి అప్పగించానని, అందులో అంకురా వైద్యులు అద్భుతమైన ఫలితాలను చూపించారని సోనూసూద్ ప్రశంసించారు.

Related Posts

Latest News Updates