భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది. ఈ ప్రకియను ప్రాచీన హిందూ మతంకు సంబంధించిన సూర్య సిద్ధాంతంలో కూడా చెప్పబడింది. సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకముగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై చీకటి కమ్ముకోవడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. విజ్ఞాన శాస్త్రం గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇటువంటి నమ్మకాలు తగ్గాయి.
భూమిని చంద్రుడి పూర్ణ ఛాయ (అంబ్రా) కప్పినపుడు మాత్రమే సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అందుచేత సంపూర్ణ సూర్య గ్రహణాలు, భూమ్మీద ఎక్కడైనా సరే, చాలా అరుదు. సంపూర్ణ సూర్య గ్రహణం చూడదలచినవారు ఆ గ్రహణం పట్టే ప్రదేశాలు సుదూరంలో ఉన్నప్పటికీ అక్కడకు వెళ్ళి ఆ గ్రహణాన్ని చూస్తారు. 1999లో ఐరోపాలో కనిపించిన సూర్యగ్రహణమును ప్రపంచంలో అత్యధిక ప్రజలు వీక్షించారని చెబుతారు. దీనివలన గ్రహణాల పట్ల ప్రజలకు అవగాహన పెరిగింది.
సూర్య గ్రహణాలు నాలుగు రకాలు.
సంపూర్ణ సూర్య గ్రహణం: చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడం వల్ల ఇది జరుగుతుంది. అత్యంత ప్రకాశ వంతమైన గోళం వలే కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయ వల్ల ఒక సన్నటి అంచు వలే కనిపిస్తాడు. ఏదైన సమయంలో సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశములో వారికి మాత్రమే కనిపిస్తుంది.
అంగుళీయక (యాన్యులర్) సూర్య గ్రహణం: సూర్యుడు చంద్రుడూ ఒకే కక్ష్య లోకి వస్తారు. కాని సూర్యుని కంటే చంద్రుని పరిమాణము చిన్నదిగా ఉండడం వలన, చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం వలే కనిపిస్తాడు.
సంకర గ్రహణం: ఇది సంపూర్ణ, అంగుళీయక సూర్య గ్రహణాలకు మధ్యస్తంగా ఉంటుంది. ఈ సంకర గ్రహణము భూమిపై కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ గ్రహణంగా, మరి కొన్ని ప్రదేశాలలో పాక్షికంగాను కనిపిస్తుంది. సంకర గ్రహాణాలు అరుదు.
పాక్షిక సూర్య గ్రహణం: సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. పాక్షిక గ్రహణం భూమి మీద చాలా భాగాలనుండి కనిపిస్తుంది.
సూర్య గ్రహణం నాటి సూర్య, చంద్ర, భూ స్థితులు ఎలా ఉంటాయో ప్రక్కన ఉన్న బొమ్మలో చూడవచ్చు. ముదురు బూడిద రంగుతో ఉన్న భాగాన్ని పూర్ణ ఛాయ (అంబ్రా) అని పిలుస్తారు. లేత బూడిద రంగులో ఉన్న భాగాన్ని ఉప ఛాయ (పెనంబ్రా) అని పిలుస్తారు. ముదురు బూడిద రంగు భాగంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. లేత బూడిద రంగు ప్రాంతంలో పాక్షిక సూర్యగ్రహణము కనిపిస్తుంది. భూని చుట్టూ ఉండే చంద్రుని కక్ష్య, సూర్యుడి చుట్టూ తిరిగే భూమి కక్ష్యా తలానికి 5 డిగ్రీల కంటే కొద్దిగా ఎక్కువ కోణంలో వంగి ఉంటుంది. దీని వలన అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడికి పైనో క్రిందో ఉంటాడు. అమావాస్య నాడు, చంద్రుడు చంద్ర కక్ష్య, భూకక్ష్య ఖండించుకునే బిందువులకు దగ్గరగా ఉన్నపుడు మాత్రమే సూర్య గ్రహణము ఏర్పడుతుంది. సూర్యగ్రహణం ఈ సారి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో గ్రహణం ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే భారత్‌లో సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో కనిపిస్తుందో తెలుసుకుందాం.
అక్టోబర్ 25వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం ఐరోపా, ఈశాన్య ఆఫ్రికా మరియు పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో దర్శనమివ్వనుంది.భారత్‌లో కూడా పలు నగరాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది.ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ఉజ్జయిని, వారణాసి మధుర, హైదరాబాద్‌లతో పాటు మరికొన్ని నగరాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది.
ఈ సంవత్సరం అక్టోబరు 25వ తేదీన మంగళవారం నాడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. దీపావళి పండుగ నాడు సూర్యగ్రహణం ఏర్పడడంతో, ఈ సారి దీపావళి పండుగను అక్టోబర్ 24వ తేదీన సాయంత్రం అమావాస్య ఘడియలు ప్రారంభమైన తర్వాత నుండి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం దీపావళి పండుగ తర్వాత రోజున సూర్యగ్రహణం రావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు.
సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఇదే
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీదికి వచ్చినప్పుడు లోకానికి వెలుగు నిచ్చే సూర్యుడిని రాహువు మింగేస్తాడు. అంటే అడ్డుపడతాడు. దీని వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం సూర్యగ్రహణం మధ్యాహ్నం 2.32 నుండి సాయంత్రం 6.32 నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. హిందూ ధర్మంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహణాలు పుట్టిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. గ్రహణ సమయం లో ఆలయాలనే మూసి వేస్తారు అంటే గ్రహణాలకు ఉండే ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలను గురించి, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి పండితులు అనేక విషయాలను చెప్పారు. గ్రహణం సమయంలో ఎవరు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే వారికి అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గ్రహణం సమయంలో ఎవరు భోజనం చెయ్యకూడదు. గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. అందరూ ఇంట్లోనే ఉండాలి. గ్రహణం సమయంలో సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం శరీరంపై పడితే అది దుష్ప్రభావాలను చూపిస్తుంది కాబట్టి గ్రహణ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. అమావాస్య నాడు సూర్యగ్రహణం సమయం ఇదే.. గ్రహణసమయంలో చెయ్యకూడని, చెయ్యాల్సిన పనులివే!!
ఈ సంవత్సరం అక్టోబరు 25వ తేదీన మంగళవారం నాడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. దీపావళి పండుగ నాడు సూర్యగ్రహణం ఏర్పడడంతో, ఈ సారి దీపావళి పండుగను అక్టోబర్ 24వ తేదీన సాయంత్రం అమావాస్య ఘడియలు ప్రారంభమైన తర్వాత నుండి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం దీపావళి పండుగ తర్వాత రోజున సూర్యగ్రహణం రావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు.
సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఇదే
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీదికి వచ్చినప్పుడు లోకానికి వెలుగు నిచ్చే సూర్యుడిని రాహువు మింగేస్తాడు. అంటే అడ్డుపడతాడు. దీని వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం సూర్యగ్రహణం మధ్యాహ్నం 2.32 నుండి సాయంత్రం 6.32 నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. హిందూ ధర్మంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహణాలు పుట్టిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. గ్రహణ సమయం లో ఆలయాలనే మూసి వేస్తారు అంటే గ్రహణాలకు ఉండే ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
సూర్య గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలివే
గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలను గురించి, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి పండితులు అనేక విషయాలను చెప్పారు. గ్రహణం సమయంలో ఎవరు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే వారికి అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గ్రహణం సమయంలో ఎవరు భోజనం చెయ్యకూడదు. గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. అందరూ ఇంట్లోనే ఉండాలి. గ్రహణం సమయంలో సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం శరీరంపై పడితే అది దుష్ప్రభావాలను చూపిస్తుంది కాబట్టి గ్రహణ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు.
గ్రహణం సమయంలో ఇళ్ళలో ఈ పనులు చెయ్యండి
ఇక గ్రహణం పట్టే ముందు పట్టు స్నానాన్ని, విడిచిన తరువాత విడుపు స్నానం చేయాలని చెబుతున్నారు. గ్రహణం సమయంలో ఇళ్ళల్లో ఉండే అన్ని ఆహార పదార్థాల పైన గరికను వేయాలని సూచిస్తున్నారు. సూర్యుడి మంత్రాన్ని జపించి, గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరు స్నానం చేయాలని, ఇంటిని శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక గర్భిణీలు అయితే ముఖ్యంగా సూర్య గ్రహణం సమయంలో అత్యంత జాగ్రత్తతో మెలగాలని సూచిస్తున్నారు. సూర్యగ్రహణ సమయంలో గర్భిణీలు ఎలాంటి పనులు చేయకూడదు. కదలకుండా పడుకోవాలి. గ్రహణం సమయంలో పొరపాటున కూడా ఆహారం తీసుకోకూడదు. గ్రహణానికి ఆరు గంటల ముందే ఆహారం తీసుకోవాలి.
గర్భిణీలు సూర్య గ్రహణం సమయంలో జాగ్రత్త
గర్భిణి స్త్రీలు గ్రహణ సమయంలో కూరగాయలను కొయ్యటం, భోజనం చెయ్యటం, బరువైన పనులు చెయ్యటం చేస్తే , కడుపులోని బిడ్డపై ప్రభావం పడి ఏదో ఒక లోపంతో వారు పుడతారని చాలామంది విశ్వసిస్తారు. గ్రహణ సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు పాటించకపోతే అనర్థాలు జరుగుతాయని అందుకే పెద్దలు సూచిస్తారు. సూర్య గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై అతినీలలోహిత కిరణాలు పడతాయని, ఫలితంగా, ఆహారాన్ని తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతారు. అందుకే గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ ఆహారాన్ని తీసుకోకూడదు.
గ్రహణం పూర్తయిన తర్వాత చెయ్యాల్సింది ఇదే
పవిత్రమైన నది తీర ప్రాంతాలలో జపం చేసుకుంటే మంచిదని చాలామంది భావిస్తారు. సూర్యగ్రహణం వేళ ప్రతి ఒక్కరు కచ్చితంగా ఉపవాసం ఉండాలని, ఉపవాసం ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. చిన్న పిల్లలను బయటకు వెళ్లనివ్వకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. తులసి ఆకుల పైన నీళ్ళు ఉంచితే గ్రహణ ప్రభావం కొంతమేరకు తగ్గుతుందని చెబుతున్నారు. గ్రహణం పూర్తి అయిన తరువాత స్నానం చేసి శక్తికొలది పేదలకు దానధర్మాలు చేస్తే మంచిదని చెబుతున్నారు.
25-10-2022.ఆశ్వీయుజ బ హుళ అమావాస్య మంగళ వా రం పాక్షిక సూర్య గ్రహణము.*
స్పర్శ కాలం* 5-02pm
మోక్ష కాలం* 6-27pm
గ్రహణ సమయంలో మగవారు యధాశక్తి గాయత్రి జపం ఆచరిం చాలి*
స్వాతి నక్షత్రం తులారాశివారు గ్రహణంతరవాత రోజునఈక్రింది వస్తువులుధాన్యందానంచేయాలిగోధుమలు కిలోంపావు.*
బియ్యం కిలోం పావు.*
ఉలవలు కిలోం పావు.*
రాగిచెంబు., ఆవు నెయ్యి.*
వెండి నాగ పడగ.వెండి సూర్య ప్రతిమ దానం చెయ్యాలి*
యధా శక్తి జప తపాదులురుద్రా భిషేకం ఆచరించాలి*
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు