శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా… ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది.
అయలాన్ అంటే ఏలియన్. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలియజేసింది. తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అందుకున్న ‘వరుణ్ డాక్టర్’ సినిమా తర్వాత శివ కార్తికేయన్, కెజెఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది.
తమిళనాడులో ‘అయలాన్’ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
కేవలం నాలుగు రోజుల్లో రూ .50 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ వారంలో వంద కోట్ల మార్క్ చేరువ కానుంది. శివ కార్తికేయన్ నటనతో పాటు కామెడీ, సినిమా కాన్సెప్ట్ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైన్స్ ఫిక్షన్ యూనివర్స్ కాన్సెప్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.
కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ ”హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని సినిమా భారతీయ ప్రేక్షకులకు అందించాలని క్వాలిటీ విషయంలో మీ టీమ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటంతో, ఆ వర్క్ కంప్లీట్ కావడానికి సుమారు రెండేళ్లు పట్టింది. తమిళ ప్రేక్షకుల ఆదరణ చూశాక మా కష్టాన్ని మర్చిపోయాం. అంత సంతోషంగా ఉంది. ఏఆర్ రెహమాన్ గారి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలని ఈ నెల 26న ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం” అని చెప్పారు.
శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమాలో ఇషా కొప్పికర్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర తారాగణం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ‘అయలాన్’కు వర్క్ చేశారు. ఈ సినిమాకు ఎడిటర్ : రూబెన్, పోస్టర్ డిజైన్ : గోపి ప్రసన్న, ప్రొడక్షన్ డిజైన్ : టి. ముత్తురాజ్, వీఎఫ్ఎక్స్ : బిజోయ్ ఆర్పుతరాజ్ (ఫాంటమ్ ఎఫ్ఎక్స్), కాస్ట్యూమ్ డిజైన్ : పల్లవి సింగ్, నీరజా కోన, కొరియోగ్రఫీ : గణేష్ ఆచార్య, పరేష్ శిరోద్కర్, సతీష్ కుమార్, సంగీతం : ఏఆర్ రెహమాన్, నిర్మాత : కోటపాడి జె. రాజేష్, దర్శకత్వం : ఆర్. రవికుమార్.