టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు విషయంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజు కూడా ఈ నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే… ఈ నిందితులను పోలీసులు నేడు నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి తీసుకెళ్లారు. రెండో రోజు కస్టడీలో భాగంగా నిందితుల వాయిస్ ని రికార్డ్ చేయనున్నారు. అలాగే వారి వాయిస్ ను ల్యాబ్ లో పరీక్ష చేయనున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడ్డ ఆడియో వీడియోలోని వాయిస్ తో దీనిని పోల్చుకోనున్నారు. దీంతో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మరింత కీలకం కానుంది. అయితే.. ఈ కేసులో రామచంద్ర భారతి ఇచ్చే వాంగ్మూలమే కీలకం కానుంది. నిందితుల వెనుక ఎవరెవరున్నారో అన్న అంశంపైనా సిట్ విచారిస్తోంది.