ధనుష్ నటించిన ”సార్” సినిమాలోని ”బంజారా” పాట రిలీజ్

ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం సార్. ఫిబ్రవరి 17 న థియేటర్స్ లోకి రానుంది ఈ మూవీ. దీంతో రోజు కో అప్ డేట్ ఇస్తున్నారు మూవీ మేకర్స్. తాజాగా మూవీకి సంబంధించిన బంజారా పాటను మూవీ మేకర్స్ లాంఛ్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్‌ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా.. సుద్దాల అశోక్‌ తేజ రాశారు.ఈ సాంగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆడవుంది నీవే ఈడ వుంది నీవే… నీది కానీ చోటే లేనేలేదు బంజారా.. యాడ పుట్టెతీగ యాడ పుట్టె బూర… తోడు కూడినాక మీటిచూడు తంబూర అంటూ ఈ పాట సాగుతుంది. సుద్దాక అశోక్ తేజ రాసిన ఈ పాట హత్తుకునేలా వుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మాస్టారు (తెలుగు వెర్షన్), వావాథి (తమిళంలో) సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

 

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ సార్ కి ప్రజెంటర్. ఇక.. బంజారా పాట లిరికల్ వీడియో కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది. అందులోని చిత్రాలు అచ్చు పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా వున్నాయి.ఈ బంజారా పాటపై రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడారు. జీవితం వెనకున్న వేదాంతాన్ని, జనన మరణాల మధ్య వున్న బతుక బాట, దాని పరమార్థాన్ని వివరించేలా వుంటుందన్నారు. ఆది శంకర తత్వాన్ని, భగవద్గీత సారం నేపథ్యంలో ఈ పాటకు సాహిత్యం అందించామని వివరించారు.

Related Posts

Latest News Updates