కోలీవుడ్ నిర్మాత, రైటర్ వైరముత్తు ప్రవర్తనపై గాయని చిన్మయి మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఆయనతో జాగ్రత్తగా మసులుకోవాలని సూచించింది. కోలీవుడ్ యువ నటి అర్చన.. వైరాముత్తును కలిశానంటూ ఫోటోలు షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే చిన్మయి పై వ్యాఖ్యలు చేసింది. మొదట… ఆయన గొప్పగానే వుంటారని, రానూ రానూ ఇబ్బందులకు గురి చేస్తాడని పేర్కొంది. దయచేసి అప్రమత్తంగా వుండు. వీలైనంత వరకూ దూరం పెట్టు. ఒక్కదానివే వెళ్లి ఎప్పుడూ కలవకు.. ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని వెంట తీసుకెళ్లు అంటూ సూచించింది. ఇప్పుడు ఈ మేటర్ వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వచ్చిన అర్చన… అక్కడే వున్న రైటర్ వైరముత్తుని కలుసుకుంది. ఆయన్ను కలవడం ఎంతో ఆనందంగా వుందని ట్వీట్ చేసింది.