జమ్మూ కశ్మీర్ లోని సిధ్రాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గరు ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్ లోని సిధ్రా శివార్లలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కొని వున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ స్థలంలో నిషేధిత లష్కరే తోయిబాకి చెందిన కోడెడ్ షీట్, లెటర్ ప్యాడ్ ను స్వాధీనం చేసుకున్నారు.












