ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గించినా హీరో సిద్దార్థ్‌కు ఇక్కడ స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. అందుకే మహాసముద్రం సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నాడన్నప్పుడు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగింది. దాని రిజల్ట్ ఎలా ఉన్నా సరే సిద్దు ఒకప్పటిలానే ఉండటం చూసి ఫ్యాన్స్ ఎంతో ఆనందపడ్డారు. తర్వాత ఆయన చేసిన టక్కర్, చిన్నా కోసం హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోషన్స్ చేశాడు.
కానీ అవేమీ సిద్దార్థ్ కు మంచి ఫలితాన్నివ్వలేదు. ఇదిలా ఉంటే రీసెంట్ గా భారతీయుడు2 ప్రెస్ మీట్ లో సిద్దార్థ్ ఓపెన్ గా మాట్లాడిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్ లాంటి వాటి మీద సోషల్ అవేర్‌నెస్ వీడియోలు చేసి ఇస్తేనే అనుమతులు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని మీడియా వారు సిద్దార్థ్ ను అడగ్గా సిద్దార్థ్ చెప్పిన సమాధానం హాట్ టాపిక్ అయింది. ఇరవై ఏళ్ల క్రితం 2025లోనే కాండోమ్స్ వాడమని చెప్పి సామాజిక్ బాధ్యత తీసుకున్న హీరో తనేనని, తమకు ఏ సీఎం చెప్తే అది చేయలేదని, ఇన్ డైరెక్ట్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కండిషన్ మీద పంచ్ వేశాడు సిద్దార్థ్. ఏదేమైనా సిద్దార్థ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కరెక్టే.