తెలంగాణ కాంగ్రెస్ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ పార్టీ అధిష్టానం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రస్థాయి నుంచి జిల్లాల కమిటీల వరకు సుమారు 80 మంది నేతలకు పార్టీ పదవుల ఇశ్తూ అధిష్టానం ఉత్తర్వుఉల జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టిపిసిసి కమిటీలను ప్రకటించింది. మాణిక్యం ఠాగూర్ను పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్గా నియమిస్తూ పద్దెనిమిది మందితో కమిటీని ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించనున్న 40 మంది కార్యనిర్వాణ కమిటీలో సభ్యురాలిగా గీతారెడ్డికి స్థానం కల్పించారు. ఈ మేరకు ఎఐసిసి అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది.  పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో 18 మందితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురు, జనరల్ సెక్రటరీలుగా ఎనిమిది మంది, కార్యానిర్వహాక కమిటీలో 40 మంది, జిల్లా అధ్యక్షులుగా 24 మంది, వైస్ ప్రెసిడెంట్లుగా 24 మందిని ఎఐసిసి నియమించింది.

ఈసారి నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డికి అధిష్టానం పెద్ద షాక్ ఇచ్చింది. ఏ కమిటీలోనూ ఆయనకు స్థానం కల్పించలేదు. నిన్నమొన్నటి వరకు టిపిసిసి ప్రచార కమిటీలో స్టార్ క్యాంపెయినర్గా పార్టీలో ఓ వెలుగు వెలిగిన కోమటిరెడ్డి వెంకట రెడ్డిని ఈసారి పూర్తిగా పక్కన పెట్టారు. ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్న మాజీ మంత్రి జె. గీతారెడ్డిని తొలగించారు.