గోరటి వెంకన్న చేతుల మీదుగా “శివ శంభో” పోస్టర్ విడుదల

తెలుగు సాహిత్యం తో సంస్కృతి , భక్తి కలగలిపిన చిత్రం “శివ శంభో”

అనంత ఆర్ట్స్ పతాకంపై నర్సింగ్ దర్శకత్వంలో రాజ గోపాల్ , దోరవేటి సుగుణ నిర్మిస్తున్న తనికెళ్ల భరణి సుమన్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం “శివ శంభో”. ఈ సినిమా పోస్టర్ విడుదల ప్రముఖ గాయకుడు మరియు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చేతుల మీదుగా చిత్ర బృందం సమక్షంలో విడుదల చేశారు.. ఈ చిత్రంతో పరిచయం అవుతున్న హీరో కృష్ణ ఇస్లావత్, హీరోయిన్ కేశవర్థిని, బేబీ రిషిత తదితరులు ఇందులో ముఖ్య భూమికలు పోషించారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యం సంస్కృతి తో పాటు అన్ని హంగులతో ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తుంది. మరియు ఈ ఆడియో ఫంక్షన్ కి తప్పకుండా వస్తా అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు… మంచి కాన్సెప్ట్ తో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందని వెంకన్న పేర్కొన్నారు.దర్శకుడు నర్సింగ్ ను ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు.మహా శివరాత్రి కి సినిమా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నర్సింగ్ ప్రకటించారు.సినిమా మాటలు, పాటల రచయిత దోరవేటి మాట్లాడుతూ ఈనాటి సమాజానికి డబ్బుకు,సుఖాలకు, సౌకర్యాలకు కొరత లేదని, మనశ్శాంతి లేక కొట్టుకుంటున్నారని, పరమ శివుని నమ్ముకుంటేనే శాంతి దొరుకుతుందనే సందేశం తో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నర్సింగ్, రచయిత దోరవేటి తో పాటు నటీనటులు వేణు, బేబీ రిషిత, ఎన్. రమేశ్ యాదవ్, అమరేంద్ర మరియు కో ప్రొడ్యూసర్ శ్రీశైలం రెడ్డి, మేనేజర్ చిట్టి బాబు, టెక్నీషియన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

బ్యానర్ :అనంత ఆర్ట్స్
నిర్మాత:రాజా గోపాల్ మరియు దోరవేటి సుగుణ, శ్రీశైలం రెడ్డి
డైరెక్టర్ :నర్సింగ్ రావు
హీరో హీరోయిన్ :కృష్ణ ఇస్లావత్, కేశవర్థిని బేబీ రిషిత
పాటలు మాటలు , సంగీతం : దోరవేటి
ముఖ్యపాత్రలో : తనికెళ్ళ భరణి, సుమన్, టార్గాన్, విజయ్ రంగరాజన్, చిల్లర వేణు, రామస్వామి, రజాక్, మల్లేశ్, రవిరెడ్డి, రమేష్ యాదవ్, శ్రీకర్,
విగ్నేష్,
ఆర్టిస్ట్ :సాయి మాధవ్
PRO గోపి జర్నలిస్ట్

Related Posts

Latest News Updates