పార్లమెంట్ మెట్లు దిగుతుండగా జారిపడ్డ శశిథరూర్.. బెణికిన ఎడమ కాలి మడమ

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పార్లమెంట్ లో జారి పడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలి మడమ బెణికింది. పార్లమెంట్ మెట్లు దిగుతుండగా… జారిపడ్డారు. ప్రస్తుతం వైద్యుల సలహాతో ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కాలి మడమ బెణికిందని, నడవలేని పరిస్థితుల్లో వున్నానని, అందుకే పార్లమెంట్ కు హాజరవ్వడం లేదని ప్రకటించారు. అలాగే నియోజకవర్గంలో వారాంతపు పర్యటన కూడా రద్దు చేసుకుంటున్నానని తెలిపారు.

”కొంత అసౌకర్యానికి గురయ్యాను. పార్లమెంటులో మెట్లు దిగుతుండగా కాలు జారింది. ఎడమకాలి మడమ బెణికింది. కొద్దిసేపు పట్టించుకోనప్పటికీ నొప్పి తీవ్రం కావడంతో ఆసుపత్రికి వెళ్లాను. ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉన్నారు. నియోజకవర్గం కార్యక్రమాలు రద్దు చేసుకున్నాను” అని శశిథరూర్ ట్వీట్ చేశారు. కాలికి ప్లాస్టర్ వేసి ఉన్న ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు.

Related Posts

Latest News Updates