షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ మూవీ ఈ నెల 25 న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చిత్రం యూనిట్ ప్రమోషన్ చేసే కార్యక్రమాల్లో బాగా బిజీగా వుంది. ఇక.. షారూక్ కూడా ట్విట్టర్ చాట్ సెషన్ నిర్వహించాడు. పఠాన్ మూవీ రిలీజ్ కాగానే.. .తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్ కైనా వస్తారా? అంటూ అడిగాడు. దీనికి షారూక్ ఖాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రాంచరణ్ కనుక తనను ఏదైనా థియేటర్ కి తీసుకెళ్తే మాత్రం కచ్చితంగా ఆ రోజు థియేటర్ కి వెళ్తా అంటూ షారూక్ పేర్కొన్నాడు. షారూక్ ఈ విధంగా రామ్ చరణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడని రాంచరణ్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కాగా, ఈ నెల 10న ‘పఠాన్’ తెలుగు వెర్షన్ ట్రైలర్ను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి బెస్టాఫ్ లక్ చెప్పారు. దీనికి షారూక్ కృతజ్ఞతలు తెలిపాడు.
Yeah if Ram Charan takes me!! https://t.co/LoaE4POU79
— Shah Rukh Khan (@iamsrk) January 21, 2023












