ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రాలు… మూడో రోజు గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఆశ్వయుజ శుద్ధ తదియ. ఈ సందర్భంగా అమ్మవారు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గాయత్రీ దేవి రూపంలో వున్న అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనలో ధీ శక్తి పెరుగుతుంది. ఆ శక్తే మనందర్నీ రక్షిస్తుంది. అందుకే అమ్మవారికి గాయత్రీ అని పేరు వచ్చింది. సూర్య నమస్కారాలు, సంధ్యావందనాల ద్వారా ఈ సూర్యకిరణ శక్తినే అందరూ ఉపాసించి, తమ శక్తిని పెంచుకుంటారు. ఈ భావనకు సంకేతంగానే గాయత్రీ దేవి అలంకారం వుంటుంది. గాయత్రీ దేవిని పూజిస్తే సలక ఉపద్రవాలూ తొలుగుతాయని, బుద్ధి తేజోవంతం అవుతుందని నమ్మకం.

Related Posts

Latest News Updates