తిరుప్పావై – శంఖమును, చక్రమును ధరించిన పుండరీకాక్షుని గానముచేయటకై లేచి రమ్ము

తిరుప్పావై –14 వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదముతో
ఉజ్ఞ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్
శెజ్ఞ్గళు నీర్వాయ్ నెగిలిన్దుఆంబల్వాయ్ కూమ్బినకాణ్
శెజ్ఞ్గల్పొడిక్కూరై వెణ్ బల్ తవత్తవర్
తజ్ఞ్గల్ తిరుక్కోయిల్ శజ్ఞ్గిడువాన్ పోగిన్రార్
ఎజ్ఞ్గలై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్ఞ్గా యెలున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్
శజ్ఞ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పజ్ఞ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.
తాత్పర్యము…
స్నానము చేయుటకు గోపికల నందరను లేవుదునని చెప్పి నిద్రించుచున్న ఒక యమెను ఇందు మేల్కొలుపుచున్నారు.
ఓ పరిపూర్ణురాలా ! నీ పెరటితోటలో దిగుడుబావిలోని ఎఱ్ఱతామరలు వికసించినవి. నల్లకలువలు ముడుచుకొనిపోవుచున్నవి. లెమ్ము. ఎఱ్ఱని కాషాయములను దాల్చి తెల్లని పలువరుస గలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ యాలయములలో ఆరాధన మొనర్చుటకై పోవుచున్నారు లెమ్ము. మమ్ములను ముందుగానే మేల్కొని వచ్చి లేపుదునని మాట నిచ్చినవు. మరచితివా ! ఓ లజ్ఞావిహీనురాలా ! లెమ్ము. ఓ మాటనేర్పు గలదానా ! శంఖమును చక్రమును ధరించినవాడును, ఆజానుబాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచి రమ్ము.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు

Related Posts

Latest News Updates