ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తన ఉదారతను చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. 410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామని సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్ కుమార్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. ఈ డోసులను ఎలా అందజేయాలో తమకు చెప్పాలని సీరం కోరింది. కొవిషీల్డ్‌కు ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చిన నాటినుంచి ఇప్పటిదాకా సీరమ్ సంస్థ ‘జాతీయ టీకా కార్యక్రమం’ కింద 170కోట్ల డోసుల టీకాలను సరఫరా చేసింది. ఇక.. చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నా… భారత్ లో ఆందోళ చెందాల్సిన అవసరం లేదని, భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగిందని సీరమ్ అదినేత పూనావాలా సూచించారు.












