ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు వున్నాయి. మూవీ యూనిట్ విడుదల చేసిన పాటలు, పోస్టర్లను చూస్తుంటే.. ఫ్యాన్స్ నుంచి అమితమైన రెస్పాన్స్ వచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో వాల్తేరు వీరయ్య గురించి టాక్ కూడా నడుస్తోంది. పైగా.. అందులో మాస్ మహారాజా రవితేజ కూడా వున్నాడు. దీంతో రచ్చ రంబోలే అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ కి దగ్గరపడుతుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. దీనిని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.












