ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ… “విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ – కామధేను పురస్కారం” అందుకున్నారు. హైదరాబాద్, బేగంపేటలోని టూరిజం ప్లాజాలో అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న 50 మందికి ఈ పురస్కారాలు అందించారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నవారిలో ప్రముఖ కథానాయకుడు సుధీర్ బాబు మాతృమూర్తి – విద్యావేత్త శ్రీమతి పోసాని రాణి, ప్రముఖ సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ ఉన్నారు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ వేడుకలో జర్నలిజం విభాగంలోలో అప్పాజీ ఈ అవార్డు అందుకున్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన సంస్థ సి.ఇ. ఓ సత్యవోలు పార్ధసారధికి అప్పాజీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అప్పాజీ ఇంతకుముందు… ఎన్ఠీఆర్ జాతీయ పురస్కారం, దాసరి జీవన సాఫల్య పురస్కారం, గిడుగు రామ్మూర్తి స్మారక జాతీయ పురస్కారం వంటి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు!!