కర్నాటక శాసనసభలో హిందుత్వ సిద్ధాంత కర్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ చిత్ర పటాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శాసన సభలో గాంశీ, అంబేద్కర్, పటేల్, బసవన్న, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ ఫొటోలతో పాటు… వీర సావర్కర్ ఫొటోను కూడా ఏర్పాటు చేశారు. దీనిపై కాంగ్రెస్ నానా హంగామా చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. సావర్కర్ ఫోటోను అసెంబ్లీలో ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో చెప్పాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.
తాము అవినీతి అంశాన్ని లేవనెత్తుతామని తెలుసు కాబట్టే… దాని నుంచి డైవర్ట్ చేయడానికే సావర్కర్ ఫొటో పెట్టారని ఆరోపించారు. వెంటనే సావర్కర్ ఫోటోను తీసేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. దీనికి పోటీగా బీజేపీ కూడా నినాదాలు చేసింది. సావర్కర్ పై తప్పుడు ప్రచారాన్ని పోగొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది.