నారాయణ దాస విరచిత యదార్థ రామాయణ హరికథా గానములు హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో జరుగుతున్నాయి. ఆదిభట్ల నారాయణ దాసు, హరికథా ప్రవీణ నేతి లక్ష్మీనారాయణ భాగవతుల సంస్మరణ పూర్వక హరికథా గాన మహోత్సవాలతో ఈ నెల 12 నుంచి 17 వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు శ్రీమతి సప్పా భారతి భాగవతారిణి (ఏలూరు) గారిచే సీతా కల్యాణం హరికథాగానము రమణీయముగా జరిగింది. డా. పాణ్యం దక్షిణామూర్తి గారు వయోలిన్ పైన, శ్రీ ఆర్. సుధాకర్ గారు మృదంగం పైన సహకారం అందించారు. శ్రీమతి భారతీయం సత్యవాణి గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు. పై కార్యక్రమములు నేతి కుటుంబ సభ్యులు మరియు అన్నమయ్య పరివారము, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సంధాన కర్తలుగా శ్రీ యనమండ్ర వెంకట కృష్ణయ్య మరియు శ్రీ బుర్రా పద్మనాభ శర్మ భాగవతులు వున్నారు.