ఎప్పుడు భోగి జరుపుకోవాలి, ఎన్నడు పండగ చేసుకోవాలి

మకర సంక్రాంతి
ఈ సంవత్సరం సంక్రాంతి పండగ గూర్చి అందరికీ సందేహంగా వుంది,
ఎప్పుడు భోగి జరుపుకోవాలి, ఎన్నడు పండగ చేసుకోవాలి అని …
కొందరు ఈ నెల 14న సంక్రాంతి అంటే,
మరి కొందరు 15వ తేదీనే అని చెబుతున్నారు.
అయితే సిద్ధాంతులు, పండితులు నిర్ణయించిన ప్రకారం…
ఈ నెల 14న రాత్రి 8 గంటల 45 నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, కాబట్టి ఆ సమయంలో సూర్య భగవానుని పూజించటం, పుణ్య స్నానాలు, దానాలు చేయడం సాధ్యం కాదు.
కావునా మరుసటి రోజు, అనగా జనవరి 15
తెల్లవారుఝామునుండి పవిత్ర స్నానమాచరించి, జప , తప , దానాలు ఆచరించడం వలన విశేషమైన పుణ్య ఫలం కలుగుతుందని శాస్త్రాలననుసరించి, మన పెద్దలు చెబుతున్నారు…
సంక్రాంతి పూజా విధానం
పరమ పవిత్రమైన సంక్రాంతి పర్వదినము రోజున ఉదయాన్నే బ్రహ్మీముహూర్తంలో స్నానమాచరించి , సూర్య భగవానునికి అర్ఘ్యo సమర్పించాలి.
సూర్య భగవానుని బీజాక్షరీ మంత్రాన్ని జపించాలి,
” ఓం హ్రాం హ్రీo హ్రౌo స: సూర్యాయ నమః ”
ఆదిత్య హృదయం పఠించి అర్ఘ్యం సమర్పించాలి,
అటుపిమ్మట …
సూర్య గాయిత్రి జపం చేయడం చాలా శ్రేయస్కరం…
“ఓం భాస్కరాయ విద్మహే, మహ ధ్యుతికరాయ ధీమహి, తన్నః సూర్య ప్రచోదయాత్ “…
వీటి వలన మనకు ఆయుః, ఆరోగ్యాలు, సిద్ధించి , మనః సంకల్పాలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు…
సంక్రాంతి పర్వదినం దానం ధర్మం చేయుటవలన ఆ కుటుంబంలో శుభకార్యాలు (శుభాలు)జరుగుతాయని , అంతులేని పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి…
14-1-2023…భోగి పండుగ
15-1-2023…మకర సంక్రాంతి.
16-1-2023…కనుమ పండుగ.
మీ
కంభంపాటి నాగఫణిశర్మ

Related Posts

Latest News Updates