నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ “కెప్టెన్ మిల్లర్” స్టన్నింగ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌తో అందరిద్రుష్టిని ఆకర్షించింది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రంలో వెర్సటైల్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర కోసం ప్రాజెక్ట్ లో చేరారు.తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణమైన కథలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తున్నారు సందీప్ కిషన్. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి బిగ్ స్టార్ల తో కలిసి సందీప్ చేస్తున్న ‘మైఖేల్’ చిత్రం కూడా భారీ అంచనాలను పెంచింది. సందీప్ కిషన్, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మానగరం’లో హీరోగా తన అద్భుతమైన నటనతో తమిళ ప్రేక్షకులను కూడా మెప్పించిన విషయం తెలిసిందే. మోస్ట్ ప్రామెసింగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు ‘కెప్టెన్ మిల్లర్’ ప్రాజెక్ట్ లోకి రావడం మరింత ఆకర్షణగా నిలిచింది. ధనుష్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. తెలుగు లో ధనుష్ కి అద్భుతమైన ఆదరణ వుంది. ఇపుడీ క్రేజీ కాంబినేషన్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు ప్రేక్షకులని అలరించే చిత్రంగా వుండబోతుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ ‘కెప్టెన్ మిల్లర్’ గురించి మరిన్ని సర్ ప్రైజ్ ప్రకటనలు చేయబోతుంది. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి జి త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సహ నిర్మాతలు. కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. తారాగణం: ధనుష్, సందీప్ కిషన్ సాంకేతిక విభాగం : రచయిత, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్ నిర్మాతలు: జి. శరవణన్ , సాయి సిద్ధార్థ్ సమర్పణ: టీజీ త్యాగరాజన్ బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్ సంగీతం: జివి ప్రకాష్ కుమార్ డీవోపీ: శ్రేయాస్ కృష్ణ ఎడిటర్: నాగూరన్ ఆర్ట్: టి.రామలింగం