ఓపిక లేకపోయినా… వచ్చేశా… స్టేజీపైనే ఏడ్చేసిన సమంత

శాకుంతలం ట్రైలర్ సమయంలో నటి సమంత కన్నీరు పెట్టుకుంది. ట్రైలర్‌ ఈవెంట్‌లో గుణ శేఖర్‌ ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ప్రశసించాడు. దాంతో సామ్‌ ఎమోషనల్‌కు గురై కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం సమంత మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశాక నాపై మరింత అభిమానం పెరుగుతుంది. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని ఈవెంట్‌కు వచ్చానని’ తెలిపింది.

ఈ క్షణం కోసమే ఎన్నో రోజులుగా ఎదిరి చూస్తున్నానని, గుణశేఖర్ మీదున్న గౌరవంతోనే వచ్చానని తెలిపింది. ఈ రోజు ఎలాగైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకొని… ఓపిక లేకపోయినా బలం మొత్తాన్ని కూడబెట్టుకొని, హజరయ్యానని తెలిపింది. కొంత మందికి సినిమా వాళ్ల జీవితంలో భాగం.. కానీ గుణశేఖర్ కు సినిమానే జీవితం అని పేర్కొంది. ప్రతి సినిమా మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఆయన ప్రాణం పెట్టి తీశారని, ఆయనపై మీరు చూపించే ప్రేమాభిమానాన్ని చూడాలనుకున్నానని, అందుకే వచ్చానన్నారు. కథ విన్నప్పుడు సినిమా అద్భుతంగా ఉండాలని సాధారణంగా నటీనటులు ఊహించుకుంటారు. కొన్ని సార్లు ఆ ఊహను దాటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇందులో భాగం కావడం నిజంగా అద్రుష్టమే అని సమంత తెలిపింది.

Related Posts

Latest News Updates