ఏపీ ఉమ్మడిగా వుండాలన్నదే తమ విధానం… సంచలన ప్రకటన చేసిన సజ్జల

రాష్ట్ర విభజనపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుదిరితే ఏపీ తిరిగి ఉమ్మడి రాష్ట్రంగా వుండాలన్నదే తమ అభిమతమని, అదే తమ విధానమని సజ్జల ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రం అయ్యేందుకు ఏ అవకాశం దొరికినా… మళ్లీ కలిసేందుకే తమ పార్టీ ఓటు వేస్తుందన్నారు. మళ్లీ ఉమ్మడి ఏపీగా అవతరిస్తే.. తొలుత స్వాగతించేది తమ పార్టీయేనని ప్రకటించారు. ఏపీ విభజన చట్టం అసంబద్ధమని సుప్రీంలో కేసు వుందని, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టులో తమ వాదనలు బలంగా వినిపిస్తామని తెలిపారు.

 

అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని, విభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచీ తామే పోరాడుతున్నామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారన్న బాధ ప్రజల్లో ఇప్పటికీ వుందన్నారు. అయితే… విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై పోరాటం చేస్తూనే వుంటామని స్పష్టం చేశారు.

Related Posts

Latest News Updates