ఏపీలో జగన్ సర్కార్ అవుట్ సోర్సింగ్ వారిని తొలగించనుందన్న వార్తలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఓ ప్రభుత్వ విభాగంలో కొద్ది మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు వచ్చాయని, దీనిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని వెల్లడించారు. ఆ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులెవ్వర్నీ తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారకులని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రారని, పోలవరం పూర్తి చేయరని ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పూర్తవుతుందని సజ్జల అన్నారు.